మతత్రయం
మన భారతీయ జీవన విధానానికి, సంస్కృతికి మూలాధారం వేద వాఙ్గ్మయం. ఈ వేద వాఙ్గ్మయము ప్రతిపాదించిన పరమపురుషార్థం అనే జీవన లక్ష్యం ముముక్షత్వం. ప్రస్థానత్రయ శ్రవణం, మననం మరియు నిధిధ్యాసనం జీవుని మహాప్రస్థానానికి ఏకైకమార్గం. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మరియు భగవద్గీత. జిజ్ఙాసువులకు ఇవి సులభంగా అర్థం అవడానికి అనేకమంది మహాపురుషులు వీటికి భాష్యాలు రచించారు. కొందరు సనాతన సాంప్రదాయ గురు పరంపరలను అనుసరించి భాష్యాలు వ్రాయగా అధికులు వ్యాకరణ వాఙ్మయములలో క్రొత్త మలుపులు తెచ్చి భాష్యాలు వ్రాసారు. పెద్దలు చెప్పగా ప్రచారంలోవున్న విషయం ఈ సందర్భంలో గ్రహించాలి.